📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amanagallu Jatara: తోపులాట జరిగి నిప్పుల గుండంలో పడ్డ భక్తులు

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Amanagallu Jatara: Devotees caught in a fire due to a scuffle

Amanagallu Jatara: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో వేడుకగా జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో ఊహించని ప్రమాదం సంభవించింది. జాతరలో భాగంగా నిర్వహించే అత్యంత కీలకమైన నిప్పుల గుండం ప్రవేశం కార్యక్రమంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకుని నిప్పుల గుండం దాటే క్రమంలో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో ఈ అపశృతి జరిగింది.

Read Also: Summer 2026: పెరుగుతున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

తోపులాటతో చెలరేగిన గందరగోళం.. 10 మందికి తీవ్ర గాయాలు

నిప్పుల గుండం దాటుతున్న సమయంలో వెనుక నుంచి భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి సుమారు 10 మంది భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. మండుతున్న నిప్పుల మధ్య పడటంతో భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాతర ప్రాంగణంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు అప్రమత్తమై నిప్పుల్లో పడిపోతున్నవారిని బయటికి లాగి, గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amanagallu Jatara Nalgonda Fire Pit Mishap Sri Parvathi Ramalingeswara Swamy Jatara

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.