📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

20 మున్సిపాల్టీలను గ్రేటర్ లో విలీనం?

Author Icon By Vanipushpa
Updated: January 23, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టర్ హైదరాబాద్ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా విస్తరించాలని భావిస్తోంది. ఇందు కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా ఏకంగా ఏడు కార్పోరేషన్లు .. 20 మున్సిపాల్టీలను గ్రేటర్ లో విలీనం చేసేందుకు సిద్దమైన ప్రతిపాదనల పై ప్రభుత్వ ఆమోద ముద్ర వేయనుంది. గ్రేటర్ ఎన్నికలు సైతం వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఏడాది లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధి పెంపు ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ కు కొత్త రూపు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్​హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​(జీహెచ్​ఎంసీ) పరిధిని ఓఆర్​ఆర్​వరకు విస్తరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందు కోసం కమిటీ ఏర్పాటు చేయనుంది. అదే సమయంలో గ్రేటర్ ను మూడు కార్పోరేషన్లుగా ఏర్పాటు ప్రతిపాదన పైన చర్చలు జరిగాయి. ఇప్పుడు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి.. నివేదిక కోరనుంది. ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుంది.

గ్రేటర్ లో విలీనం జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే ఓఆర్‌ఆర్‌ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌ వరకూ నగరాన్ని ఒకేవిధంగా అభివృద్ధి చేసేందుకు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేష న్లను జీహెచ్‌ఎంసీలో విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అమలు చేయాలంటే ముందుగా సంబంధింత కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో తీర్మానం చేయాలి. కానీ, వాటిల్లో కాంగ్రెస్ కు మెజార్టీ లేదు. ఇదే సమయంలో వీటి పాలకవర్గాల గడువు ముగియనుంది. ఎన్నికల అంశం చర్చకు వస్తుంది. ఎన్నికలను వాయిదా వేసి కమిటీ ద్వారా వీటి విలీనం పైన నివేదిక కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో శివారులోని స్థానిక సంస్థల విలీనం, జీహెచ్‌ఎంసీ విభజన అంశాలపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

in greater Municipal Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.