📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

మరోసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

Author Icon By sumalatha chinthakayala
Updated: December 27, 2024 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నేడు మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నేటితో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. అదే రోజు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. ఆయన లాయర్లు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలపనున్నారు. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి, అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరనున్నారు.

ఇదివరకే బాధితురాలు రేవతి కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ ఆర్థిక సాయం చేశారు. అల్లు అర్జున్ రూ. 1కోటి రూపాయల చెక్ అందించగా, పుష్ప 2 దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు సాయం చేశారు. వీటికి సంబంధించిన చెక్కులను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును అందజేశారు.

Allu Arjun Nampally court regular bail Sandhya Theater Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.