📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Medical Colleges : మూడేళ్లలో మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు – సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: June 17, 2025 • 8:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల (Medical Colleges) అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 34 మెడికల్ కాలేజీల్లో మూడేళ్ల కాలంలో అన్ని అవసరమైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఖాళీల భర్తీకి సమగ్ర నివేదిక

మెడికల్ కాలేజీలలో లభ్యమయ్యే సదుపాయాల పర్యవేక్షణతో పాటు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సీఎం (CM Revanth) ఆదేశించారు. అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి మొహం లేదని, తక్షణమే నిధుల విడుదలకూ సిద్ధమని తెలిపారు. మెడికల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోంది.

జపాన్‌లో నర్సులకు డిమాండ్

ఇతర దేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో భారత నర్సింగ్ సిబ్బందికి అధిక డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో జపనీస్ భాషను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సూచించారు. తద్వారా విద్యార్థులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, ఇది తెలంగాణ యువత భవిష్యత్తుకు దోహదపడుతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.

Read Also :

cm revanth Google News in Telugu medical colleges new Medical Colleges Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.