హైదరాబాద్: రైతులు లాభం వచ్చే పంటలను పండించాలి ప్రపంచంలో పండే ప్రతీ పంట పండించేందుకు రాష్ట్ర వాతావరణం అనుకూలం నర్సరీలను పట్టణ వాసులకు, రైతులు ఉపయోగించుకోవాలి 19వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummal). ప్రపంచ వ్యాప్తంగా పండే ప్రతీ పంట పండించేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎన్టీఆర్ మార్గ్‌లోని ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన 19వ గ్రాండ్ నర్సరీ మేళాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల పండ్ల చెట్లు, పూలచెట్లతో పాటు రైతులు లాభం వచ్చే పంటలను పండించాలని మంత్రి సూచించారు. పచ్చదనాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని అన్నీ జిల్లా కేంద్రాల్లో నర్సరీ మేళాలు నిర్వహించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: education: విద్యను ప్రైవేట్ పరం చేయడం న్యాయమా?
నర్సరీల ప్రోత్సాహంతో రైతులకు, పట్టణ వాసులకు లాభం
నర్సరీలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చి (Minister Tummal) హైదరాబాద్‌లోనే కాకుండా పట్టణ వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రపంచ దేశాల్లో ఏ పంట పండినా ఆ పంటను మన తెలంగాణ రాష్ట్రంలో పండించేందుకు అనువైన వాతావారణం ఉందన్నారు. అకడమియా, ఆర్గానెట్ తదితర అన్ని రకాల పండ్ల చెట్లు, పూలచెట్లతో పాటు రైతులకు లాభం వచ్చే పంటలను రైతులు(Farmers) పండించుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇలాంటి నర్సరీలు రైతాంగానికి, పట్టణ వాసులకు ఉపయోగపడాలన్నారు. ప్రతీ ఏటా పెద్ద ఎత్తున గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహించేందుకు ప్రోత్సహించడం, అదేవిధంగా పండ్లు, పూలమొక్కలు, కూరగాయల మొక్కల నర్సరీలను ప్రోత్సాహించేందుకు హార్టీకల్చర్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందన్నారు.
హార్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ ఈ నర్సరీమేళాలో భారతదేశంలోని అన్ని పూలమొక్కలను అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఐదు రోజుల గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభం
ఈనెల 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉందని తెలిపారు. అన్ని రకాలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్, ఫ్రూట్స్, ఎక్సాటిక్ ప్లాంట్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. రైతులకు, పట్టణ ప్రాంతంలో గార్డెనింగ్‌కు అవసరమైన పాట్స్ పాటింగ్ మెటీరియల్ ఇలా అన్ని వససతులకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా మేళాలో అందుబాటులో ఉన్నాయన్నారు. బోన్సాయ్ గార్డెన్‌కు సంబంధించి అర్నమెంటల్ మెటీరియల్ , డెకరేషన్ మెటీరియల్ ప్రదర్శిస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా హర్యానా వెస్ట్ బెంగాల్ వంటి నార్తిండియన్ స్టేట్స్ , సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి అన్ని ప్రదేశాల నుంచి వచ్చి ఈ మేళాలో ప్రదర్శిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ వాసులు ఈ ప్రదన్శనను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటలకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: