📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Alagu Varshini: సిఎంఎ ఫౌండేషన్ పరీక్షలో ఎస్సి గురుకుల విద్యార్థుల సత్తా

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి

హైదరాబాద్ : కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ (సిఎంఎ ఫౌండేషన్) పరీక్షలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్మీడియట్లో ఎంఈసీ, సీఈసీ కోర్సు చదువుతూనే ఈ పరీక్షలో విశేష ప్రతిభ చాటారని ఎస్సి గురుకుల సోసైటీ కార్యదర్శి డాక్టర్ విఎస్ అలగు వర్షిణి తెలిపారు. సిఎంఏ ఫౌండేషన్ (CMA Foundation) పరీక్షను ప్రతి ఏడాది నవంబర్, జూన్ మాసంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ మాసంలో నిర్వహించిన సిఎంఏ ఫౌండేషన్ పరీక్షలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన విద్యార్థులు 74 మంది పరీక్షకి హాజరు కాగా వారిలో 39 మంది అర్హత సాధించినట్టు సోసైటీ సెక్రటరీ తెలిపారు.

అర్హత సాధించారు

వారిలో ఇబ్రహీంపట్నం బ్రాంచ్లో 23 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది, మేడ్చెల్ బ్రాంచ్ లో 23 మంది పరీక్ష రాయగా అందులో ఏడుగురు, గౌలిదొడ్డి బ్రాంచ్లో 28 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే.. అందులో 18 మంది అర్హత సాధించారు. సిఎంఏ ఫౌండేషన్ పరీక్షలో 4 పేపర్లు ఉంటాయి. ఇందులో ఫండమెంటల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఫౌండేషన్ ఆఫ్ అకౌంటెన్సీ, ఫౌండేషన్ అఫ్ లాస్ అండ్ ఎథిక్స్ (Foundation of Law and Ethics), ఫౌండేషన్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ప్రతి పేపర్లో 100 మార్కులు ఉండగా.. కనీసం 40 మార్కుల చొప్పున.. అలాగే నాలుగు పేపర్లలో 200 మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్టుగా పరిగణిస్తారు. సిఎంఏ ఫౌండేషన్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తదుపరి సిఎంఏ కోర్సు (మూడేళ్ళ అండర్ గ్రాడ్యుయేట్) చేసేందుకు అర్హులు.

Alagu Varshini: సిఎంఎ ఫౌండేషన్ పరీక్షలో ఎస్సి గురుకుల విద్యార్థుల సత్తా

అకౌంటెంట్ దగ్గర పనిచేసేందుకు అవకాశం

ఈ మూడేల్లు పూర్తి చేసుకున్న తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. సిఏ దగ్గర పనిచేసే వారికీ ఏడాదికి రూ.7 లక్షల వరకు ప్యాకేజీ పొందే అవకాశం ఉంటుంది. సిఎంఏ ఫౌండేషన్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అభినందించారు. భవిష్యత్తులో ఇంకా మంచి ర్యాంకులు సాధించి గొప్ప స్థాయిలో స్థిరపడాలని మంత్రి విద్యార్థులను ఆశీర్వదించారు. విద్యార్థులు మున్ముందు సిఎంఏ గ్రాడ్యుయేట్ కోర్సుని విజయవంతంగా పూర్తి చేసుకొని సిఏగా మంచి ప్యాకేజీతో స్థిరపడాలని సొసైటీ సెక్రటరీ అలగు వర్షిణి విద్యార్థులను ఆశీర్వదించారు. మరింత మంది విద్యార్థులను ఈ రంగంలో నిష్ణాతులను చేయడానికిగాను ఈ విద్య సంవత్సరం నుండి ఇబ్రహీంపట్నం, సరూర్ నగర్ ఫౌండేషన్ సివోఈల్లో 480 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అందించనున్నట్టు కార్యదర్శి స్పష్టం చేశారు.

CMA Foundation అంటే ఏమిటి?

CMA Foundation అనేది Cost and Management Accountancy కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష. ఇది Institute of Cost Accountants of India (ICAI-CMA) నిర్వహించే మొదటి దశ పరీక్ష.

CMA Foundation కి అర్హత (Eligibility) ఏమిటి?

కనీసం 10+2 (ఇంటర్ పాస్) అయి ఉండాలి.ఏ స్ట్రీమ్‌ అయినా (Science, Commerce, Arts) విద్యార్థులు అప్లై చేయవచ్చు.అభ్యర్థులు 12వ తరగతిలో చదువుతూ కూడా అప్లై చేయవచ్చు (provisional).

Read hindi news: hindi.vaartha.com

Read Also: Telangana: మహిళా సంఘాలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల రుణం–

Breaking News CMA Foundation exam results latest news MEC CEC students CMA Social Welfare Gurukulam students Telangana Gurukul students success Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.