AI Summit 2026: న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు (శుక్రవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు రంగంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్ దిశలపై చర్చించేందుకు ఈ సమ్మిట్ కీలక వేదికగా నిలుస్తోంది. భారత మండపంలో మధ్యాహ్నం 12.30 నుంచి 12.42 గంటల మధ్య సీఎం కీలకోపన్యాసం చేయనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఏఐ సాంకేతికత, ప్రభుత్వ సేవల్లో దాని వినియోగంపై వివిధ సెషన్లలో ప్రసంగిస్తారు. అలాగే స్వీడన్ ప్రతినిధుల బృందంతో మంత్రి భేటీ కానున్నారు.
Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: