అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఓ సంఘటన డాక్టర్లకే సవాల్ విసిరింది. యస్.! ఆడుకుంటూ ఆడుకుంటూ హల్క్ బొమ్మను మింగేశాడు ఓ పిల్లోడు. బొమ్మ కావాలని మారాం చేస్తే కొనిచ్చిన తల్లిదండ్రులు, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్ వీళ్లే ఈ జనరేషన్ చిన్నారులకు బెస్ట్ ఫ్రెండ్స్…! వాళ్ల వీడియోలు చూస్తూనే తింటారు ఆ టాయ్స్‌నే (Toys) పట్టుకుని పడుకుంటారు కాసేపు అవి కనిపించకపోతే పేరెంట్స్‌తో యుద్ధాలే చేస్తారు. అయితే ఈ ఆటబొమ్మలే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
Read Also: Telangana Funds: రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ
తల్లిదండ్రులు ఆడుకునే సమయంలో గమనించడం అవసరం
(Ahmedabad) ఏడాదిన్నర వయసున్న వంశ్ ఆడుకుంటూ హల్క్ బొమ్మను మింగేశాడు. నోట్లోంచి మాట రాకపోవడం ఒక్కసారిగా కిందపడిపోవడంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి పరీక్షలు చేసిన వైద్యులు ఎండోస్కోపీ ద్వారా గొంతులో హల్క్ బొమ్మ ఉన్నట్లు గుర్తించారు. ఆ బొమ్మను బయటకు తీసేందుకు ఎంతో శ్రమించారు. గొంతుభాగం అతి సున్నితంగా ఉండటం లోపలికి పంపిన మిషినరీ ఆ బొమ్మను పట్టుకోగానే జారిపోతుండటం డాక్టర్లకు సవాల్‌గా మారింది. ఇక కొన్నిగంటలపాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు బొమ్మను బయటకు తీసి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరిపీల్చుకున్నారు. మొత్తంగా గతకొంతకాలంగా ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయంటున్నారు వైద్యులు. చిన్నారులు ఆడుకునేందుకు ఇచ్చే బొమ్మల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అంతేకాదు వాళ్లు ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com