— ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 2,500 ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో యూనిట్లను విస్తరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి రుణ సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. సీజీటీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఒక్కో ఆగ్రో యూనిటక్కు (Agro Unit) రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా లభించే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. రెండేండ్లలో వీటిని నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో పంటల ఆధారంగా ఆగ్రో పరిశ్రమ స్థాపనకు ఆఫీసర్లు ప్రతిపాదనలు రెడీ చేశారు.

నిర్వహణతోపాటు ఉత్పత్తుల
ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీఅరిడ్ ట్రాపిక్స్) సాంకేతిక సహకారంతో యూనిట్లు ఏర్పాటు చేయనున్నది. ఆగ్రో ప్రాసెసింగ్యూనిట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెంతకు చేరింది. అక్కడి నుంచి అనుమతులు రాగానే యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణతోపాటు ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలను నిర్వహించనుంది. ఇక్రిశాట్ సాంకేతిక సహకారంతో యూనిట్ల ఏర్పాటు, ఆధునిక ప్రాసెసింగ్ టెక్నాలజీ (Advanced processing technology), నాణ్యత, ఉత్పత్తులు తదితర అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏమిటి?
అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ (Agro-Processing Unit) అనేది గ్రామ స్థాయిలో ధాన్యాలను ప్రాసెసింగ్ చేయడానికి ఏర్పాటు చేసే కేంద్రం. దీనిని Agro-Processing Centre (APC) అని కూడా అంటారు. ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం రైతుల ఆదాయాన్ని పెంచడం.
అగ్రో ప్రాసెసింగ్ ప్రక్రియ అంటే ఏమిటి?
అగ్రో ప్రాసెసింగ్ ప్రక్రియ అనేది వ్యవసాయం, మత్స్యవ్యవసాయం, అటవీ రంగాల నుండి వచ్చే మౌలిక ఉత్పత్తులు,మధ్యవర్తిత్వ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం (అంటే మార్చడం, మెరుగుపరచడం) చేయడమే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Land : ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణ లో రెండెకరాలు వస్తుంది – హరీశ్ రావు