📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: Adluri Laxman: గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

Author Icon By Sushmitha
Updated: December 11, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) బీఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. పేద ప్రజల సంక్షేమం, రైతుల భద్రత, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజన్ అని, అయితే బీఆర్‌ఎస్ అధినేతలకు దోచుకోవడం, దాచుకోవడం, పేదల భూములను ఆక్రమించడం మాత్రమే విజన్‌గా ఉందని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్‌ను భారీ పెట్టుబడుల లక్ష్యంతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు తెలంగాణపై చూపిన నమ్మకంతో రాష్ట్ర ప్రతిష్టను పెంచాయని ఆయన అన్నారు.

Read Also: TG: తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

Adluri Laxman The state’s prestige increased with the Global Summit

హరీష్ రావుకు అభివృద్ధిపై అసూయ, నైతిక హక్కు లేదు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, (Bhatti Vikramarka) ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ మంత్రులు మరియు ప్రభుత్వ బృందం మొత్తం కలిసి సమిష్టిగా కృషి చేయడం వల్లే ఈ సమ్మిట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని మంత్రి వివరించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులు రావడం బావ, బామ్మర్దిలకు జలసీని కలిగించిందని, అందుకే హరీష్ రావు రాత్రికి రాత్రే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ట్రంప్ కూతురు ఇవాంకా వచ్చినప్పుడు పేదలను బందీలుగా పెట్టడం, డ్రైనేజీలపై రెడ్ కార్పెట్ వేయడం చేసిన ప్రభుత్వానికి మా సమ్మిట్‌పై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి దుయ్యబట్టారు. “మీ ఇంట్లోనైనా ముందుగా తగాదాలు తగ్గించుకోండి” అంటూ హితవు చెప్పారు, కుర్చీ కోసం ఎప్పుడూ జరిగే పోరాటం తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్ స్కాములు, అప్పుల పాలనపై విమర్శలు

కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి, మిషన్ కాకతీయ ఇవన్నీ విజన్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన స్కామ్‌లు అని మంత్రి విమర్శించారు. వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టించిన సచివాలయం వానొస్తే లీకేజీలు అవుతోందని, వారి విజన్ స్థాయి మేడిగడ్డ నుంచి సెక్రటేరియట్ వరకు కుంగడం, కూలడంలోనే కనిపించిందని ఎద్దేవా చేశారు. “మీ హయాంలో పెట్టుబడుల పేరిట ఎన్ని కంపెనీలు నిజంగా తెలంగాణలో పెట్టుబడి పెట్టాయి? అని ఒక శ్వేతపత్రం విడుదల చేసేందుకు ధైర్యం ఉందా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

మా ప్రభుత్వం చేసిన ప్రతి ఎంఓయూ, ప్రతి పెట్టుబడి, ప్రతి వివరాన్ని పారదర్శకంగా పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నామని, ఇదే మా ఆకౌంటబిలిటీ అని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తీసుకున్న అప్పుల కారణంగా ఇప్పుడు ప్రతి నెల 6,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది వారి ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రావడం చూసి, అభివృద్ధి పట్ల అసూయతో హరీష్ రావు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మీ విజన్ అంతా కమీషన్లు, కాంట్రాక్టులే, ప్రజా సేవ ఒక్కటీ లేదు అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “ఖబర్దార్ హరీష్ రావు, నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇక సహించం” అని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

6000 crore monthly debt BRS leaders criticism CM Revanth Reddy vision Global Summit success Google News in Telugu Harish Rao jealousy Ivanka Trump visit Latest News in Telugu Minister Adluri Laxman Kumar red carpet on drainage state prestige Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.