Adilabad Municipal Election Results: అదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం వార్డుల్లో బీజేపీ అత్యధికంగా 21 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ చేసిన కృషి, ప్రజా మద్దతుతో కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది.
Read Also: Makthal Municipal Election Results: మక్తల్‌ను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్!
వెనుకంజలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్
అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 11 వార్డులకే పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తింది. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) తన ఉనికిని కాపాడుకుంటూ 6 స్థానాలను గెలుచుకుంది. ఇతర అభ్యర్థులు మరియు స్వతంత్రులు కలిపి 11 వార్డుల్లో విజయం సాధించి కింగ్ మేకర్లుగా మారారు.
మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ
మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించడానికి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కోసం మరో నలుగురు సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థుల సహకారంతో బీజేపీ అదిలాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ అద్భుత విజయంతో జిల్లాలో బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: