వాహనాల ధ్వంసం..11 మందికి గాయాలు
హైదరాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ మండలం కేశవ పట్నంలో ఆదివారం అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు పోలీసు బందోబస్తుతో వెళ్లిన అటవీ సిబ్బంది పై పోడు రైతులు దాడికి దిగి బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో 11 మంది అటవీ, పోలీసు సిబ్బంది గాయపడగా రెండు విభాగాలకు చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనిపై వెంటనే రంగంలో దిగిన పోలీసులు పోలీసులు, అటవీ సిబ్బందిపై దాడికి దిగిన పోడు రైతులపై కేసులు నమోదు చేయడంతోపాటు నలుగురిని అరెస్టు చేశారు. వివరాలు ఇలావున్నాయి.
అటవీ శాఖ సిబ్బంది పై ముల్తాని తెగ రైతుల దాడి
వర్షాకాలం మొదలైన తరువాత అటవీ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ సిబ్బంది ఆదివారం నాడు ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం (Kesavapatnam)లో అటవీ శాఖ భూమిలో మొక్కలు నాటేందుకు వెళ్లారు. వాస్తవానికి ఇక్కడ వున్న 60 ఎకరాలను ముల్తాని తెగకు చెందిన పోడు రైతులు ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. దీనిపై అటవీ శాఖ సిబ్బంది పలుమార్లు అభ్యంతరం చెప్పడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతున్నా వారు వినిపించుకోవడం లేదు. వీరికి కొందరు గిరిజనుల మద్దతు వుందని పోలీసులు చెబుతున్నారు. ఈ భూమిలో తాము మూడు దశాబ్దాలకు పైగా వ్యవసాయం చేస్తున్నామని ముల్తాని తెగ (Multani tribe) వారు వాదిస్తున్నారు. అయితే దీనిని ఆటవీ, పోలీసు విభాగాల సిబ్బంది అంగీకరించడం లేదు.
ఈ భూమి అటవీ శాఖ పరిధిలో వస్తుందని, అడవుల రక్షణలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటుతున్నామని, ఇందుకు సహక రించాలని అటవీ శాఖ సిబ్బంది పోడు రైతులను కోరగా అందుకు వారు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. దీ ని తరువాత పోడు రైతులు పెద్ద సంఖ్యలో కర్రలతో పాటు దుడ్డు కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో అటవీ సిబ్బందితో పాటు వీరికి భద్రతగా వచ్చిన పోలీసులపై దాడికి దిగారు. పోడు రైతులతో పాటు వారికి మద్దతుగా వున్న వారి సంఖ్య 50 మంది వరకు వుండడంతో పోలీసులతో పాటు అట వీ సిబ్బంది 11 మందికి గాయాలు తగిలాయి. ఇదే సమయంలో వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పోడు రైతులు పోలీసు, ఆటవీ సిబ్బం దికి చెందిన కొందరి ఫోన్లను లాక్కున్నారు. కాగా పోడు రైతుల దాడిలో గాయపడ్డ పోలీసు, అటవీ సిబ్బందిని ఆదిలాబాద్ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో చేర్చించారు. వీరి ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగిన తరువాత అదనపు బలగాలను ఘటనా స్థలికి తరలించి పోలీసు, అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే కేసులు నమోదు చేయడంతో పాటు దా డికి దిగిన వారిలో నలుగురిని అరెస్టు చేశారు. దీనిపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీసు, ఆటవీ సిబ్బందిపై పోడు రైతులు దాడికి దిగిన మాట వాస్తవమేనని. దీనిపై కేసు నమోదు చేసి, నలుగురు నిందితులను అరెస్టు చేశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని ఆయన వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com