Adilabad acb arrest : ఆదిలాబాద్ జిల్లాలో లంచగొండులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి ఉక్కుపాదం మోపింది. బజార్‌హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి, రైతు నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడికి చెందిన 8.35 ఎకరాల భూమికి సంబంధించి సాదా బైనామా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఉన్నతాధికారులకు పంపించేందుకు విద్యాసాగర్ రెడ్డి భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. లంచం అడిగిన విషయాన్ని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో, అధికారుల పర్యవేక్షణలో ముందస్తు ప్రణాళిక రూపొందించారు. నిర్ణయించిన సమయానికి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు.
Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ ఘటన అనంతరం ఏసీబీ (Adilabad acb arrest) అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏ ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: