📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest News: Adilabad: సిర్పూర్ లో 16 మంది మావోయిస్టుల అరెస్టు

Author Icon By Saritha
Updated: December 17, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పట్టుబడ్డ వారిలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు?

హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి మావోయిస్టుల రాక అలజడి రేపింది. (Adilabad) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) మండలం బాజ్జీపేట పంచాయితీ పరిధిలోని పెద్దదోబ గూడెంలో ఓ ఇంట్లో మావోయిస్టులు వున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఛత్తీస్ఫ్ఫడ్ లో మావోయిస్టుల కోసం పోలీసులు భారీ ఆపరేషన్ సాగుతుండడంతో అక్కడ వున్న నక్సలైట్లు తెలుగు రాష్ట్రాలలో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడి పోలీసులు సరిహద్దు జిల్లాలలో నిఘా వుంచారు. ఈ క్రమంలోనే సిర్పూర్ (యు) మండలం పెద్దదోబ గూడెంలో నక్సలైట్లు ఆశ్రయం పొందినట్లు గుర్తించిన పోలీసులు కుమురం భీం ఏఎసిపి చిత్తరంజన్ నేతృత్వంలో దాడి చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టు సానుభూతిపరులతో కలిసివెళ్లిన పోలీసులు నక్సలైట్లు ఆశ్రయం పొందిన ఇంటిపై దాడిచేసి ఎలాంటి ఎదురు కాల్పులు లేకుండానే అక్కడ వున్న 16 మందిని అ దుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక ఎకె 47, రెండు ఇన్సాస్ రైపిళ్లు, కొంత మందుగుండు సామాగ్రిని జప్తు చేశారు. పట్టుబడ్డ వారిలో మావోయస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వున్నట్లు తెలిసింది. అరెస్టయిన నక్సలైట్లలో తొమ్మిది మంది మహిళలు కూడా వున్నట్లు తెలిసింది. నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన పెద్దబోడ వాసులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టులంతా ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్ వాసులుగా చెబుతున్నారు. వీరందరిని హైదరాబాద్కు ప్రత్యేక వాహనంలో తరలించి ఒక రహస్య ప్రాంతంలో ఎస్ఐబి పోలీసుల సమక్షంలో విచారిస్తున్నారు. వీరిని బుధవారం అరెస్టు చూపే వీలుంది. కాగా నక్సలైట్ల అరెస్టు గురించి పోలీసులు మౌనం వహించారు. అరెస్టయిన వారిలో వున్నట్లుగా చెబుతున్న బడే చొక్కారావు స్వగ్రామం ములుగు జిల్లా కాల్వపల్లి. వీరిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.

Read also: AP: రోడ్ల టెండర్లలో ఇకపై సింగిల్ బిడ్ కు ఆమోదం – ప్రభుత్వం తాజా నిర్ణయం

Adilabad 16 Maoists arrested in Sirpur.

సెల్ఫోన్ వినియోగించడంతో పట్టుబడ్డ నక్సలైట్లు…?

ఇదిలావుండగా ఆసిఫాబాద్ లో నక్సలైట్లు(Adilabad) పట్టుబడిన ఉదంతం వెనుక వారు వినియోగించిన సెల్ఫోన్లే కారణమని తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌ కు చెం దిన మావోయిస్టు అగ్రనేతలతో పాటు ముఖ్య నేతలు వాడే సెల్ఫోన్ నంబర్లను పోలీసులు సేకరించి వాటిపై కొంతకాలంగా నిఘా వుంచారు. ముఖ్యంగా ఛత్తీస్‌ఘడ్‌ కు(Chhattisgarh) చెందిన అనుమానిత ఫోన్లు తెలంగాణ సరిహద్దుల్లో వాడితే నిఘా వర్గాలకు ఇట్టే తెలిసిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఛ త్తీస్ఫడ్లో కూంబింగ్ నేపథ్యంలో తెలంగాణలో కొంతకాలం ఆశ్రయం పొందాలని వచ్చిన మావోయిస్టులు తమ అనుచరులతో సెల్ఫోన్లో వరుసగా మాట్లాడారని తెలిసింది. దీనిని పసిగట్టిన నిఘా వర్గాలు పోలీసులకు పక్కా సమాచారం అందించడంతో వారు అందరిని అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Arms Seizure Bade Chokkarao Female Maoists Latest News in Telugu Maoist Arrests Naxal Activities SIB Investigation Sirpur Operation telangana police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.