Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. అడిషనల్ ఎస్పీ దుర్మరణం

Read Time:  1 min
Additional SP killed in hyderabad road accident
Additional SP killed in hyderabad road accident
FONT SIZE
GET APP

Road accident: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ మృతిచెందిన ఘటన హయత్​నగర్ పోలీస్‌స్టేషన్​ పరిధిలోని లక్ష్మారెడ్డి‌పాలెం వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హయత్‌నగర్ ​సీఐ నాగరాజు గౌడ్ కథనం మేరకు.. లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతంలో నివాసం ఉండే అడిషనల్ ఎస్పీ నందీశ్వర్​బాబ్జీ (50) శనివారం తెల్లవారుజామున వాకింగ్‌కు అని వెళ్లారు. సుమారు 4.40 గంటల ప్రాంతంలో హనుమాన్​టెంపుల్ సమీపంలో హైవేను దాటుతుండగా.. అబ్దుల్లాపూర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బాబ్జీని బలంగా ఢీకొట్టింది.

image

నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం

ఈ దుర్ఘటనలో అతడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న నందీశ్వర్ బాబ్జీ ఇటీవలే అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందినట్లుగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ నాగరాజు వెల్లడించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.