📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Manchu Manoj : నటుడు మంచు మనోజ్‌ కారు చోరీ..పోలీసులకు ఫిర్యాదు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 9, 2025 • 8:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Manchu Manoj : సినీ నటుడు మంచు మనోజ్ కారు చోరీకి గురైంది. ఇంట్లో పార్కింగ్ చేసిన కారును దొంగలు అపహరించుకెళ్లారు. కారు స్టార్ట్ చేసిన శబ్దాన్ని విని డ్రైవర్ వెంబడించినా దొంగలు చిక్కకుండా కారుతో ఉడాయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోజ్ కారు చోరీపై అతని డ్రైవర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం గండిపేట మండలం నార్సింగిలోని ముప్పా విల్లాస్లోని 13వ నెంబర్ విల్లా ముందు ఏప్రిల్ ఒకటో తేదీన మంచు మనోజ్కు చెందిన కారును ఇంటి ముందు నిలిపారు.

కారుని ఆపకుండా అతివేగంతో ఆ దొంగలు ఉడాయించారు

రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో మనోజ్ డ్రైవర్ భోజనం చేస్తుండగా.. కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. అనుమానంతో బయటికి వచ్చిన మనోజ్ డ్రైవర్ కొలుసు సాంబశివరావు బిగ్గరగా కేకలు వేస్తూ కారుని ఆపడానికి యత్నించాడు. కారుని ఆపకుండా అతివేగంతో ఆ దొంగలు ఉడాయించారు. దాంతో మనోజ్ డ్రైవర్ సాంబశివరావు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన కారు వెళ్లిన మార్గాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేశారు.

అన్ని కోణాల్లో పోలీసులు విచారణ

రాజేంద్రనగర్ సమీపంలో దొంగలు వదిలి వెళ్ళిన మనోజ్ కారు పోలీసులకు లభ్యమైంది. కారును స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో డిపాజిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కారును అపహరించింది దొంగలా లేక కుటుంబ కలహాల కారణంగా ఎవరైనా కుటుంబ సభ్యులే ఎత్తుకెళ్లారా అనేది దర్యాప్తులో తేలనున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రంభ

Actor Manchu Manoj Breaking News in Telugu Car Theft Google news Google News in Telugu Paper Telugu News Rajendra Nagar Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.