7 నెలల్లో 148 కేసులు నమోదు.. 145 మంది అరెస్టు
హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారీ విభాగాల్లో అక్రమార్కుల భరతం పట్టడంలో ఎసిబి (ACB) దూకుడు కొనసాగుతూనే వుంది. ఈ ఏడాది జూలై నెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి వ్యవహారాలకు సంబంధించి 148 కేసులు నమోదు కాగా ఈ సందర్భంగా 145 మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరితో పాటు వుండే అవుట్ సోర్సింగ్ సిబ్బంది అరెస్టయ్యారు.

అవినీతిని నిర్మూలించేందుకు ఎసిబి ప్రచారం
ఎసిబి (ACB) డిజి విజయ్ కుమార్ (DG Vijay Kumar) దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు ఎసిబి తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని, ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు చేబడుతున్నామని ఆయన తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరిగితే వెంటనే 1064కు తెలపాలని ఆయన కోరారు. గత జూలై నెల లో రాష్ట్ర వ్యాప్తంగా 22 అవినీతి కేసులు నమోదుకాగా ఈ సందర్భంగా రెడ్ హ్యాండెడ్ ట్రాప్కు సంబంధించి 5.75 లక్షల రూపాయల నగదు, 11.50 కోట్ల రూపాయల అక్రమాస్తులు జప్తు చేశామని ఆయన తెలిపారు. దీంతో పాటు రవాణా శాఖ చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద తనిఖీలు చేబట్టామని ఈ సందర్భంగా లెక్కలో రాని లక్షా 49 వేల రూపాయల నగదు జప్తు చేశామని ఎసిబి డిజి తెలిపారు. ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు రాష్ట్రంలో అవినీతికి (Corruption) సంబంధించి 148 కేసులు నమోదు చేయగా 148 మంది అరెస్టయ్యారని ఆయన వెల్లడించారు.
ఇదే సమయంలో రెడ్ హ్యాండెడ్ ట్రాపుల్లో 30.32 లక్షల రూపాయల నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 39 కోట్ల రూపాయల అక్రమాస్తులను జప్తు చేసినట్లు ఎసిబి డిజి తెలిపారు. నీటి పారుదల శాఖలో అవినీతి ఇంజనీర్లు మురళీధర్ రావు, నూనె శ్రీధర్, హరిరాం నాయక్లను ఎసిబి అధి కారులు అరెస్టు చేయగా వీరి వద్ద వెయ్యి కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. వీరికి సంబం ధించిన కేసులను ప్రత్యేకంగా విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: