📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: ACB: అవినీతి అధికారులపై ఎసిబి పంజా

Author Icon By Sharanya
Updated: September 2, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఎసిబి (ACB) దాడుల పరంపర కొనసాగుతూనే వుంది. ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు వరకు ఎనిమిది నెలల్లో మొత్తం మీద 179 కేసులు నమోదు చేయగా ఇందులో 181 మందిని అరెస్టు చేశారు. వీరిలో 167 మంది సర్కారు ఉద్యోగులు కాగా 14 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల రవాణా శాఖ చెకోపోస్టులు

మొత్తం కేసుల్లో 108 కేసులు లంచం తీసుకుంటూ పట్టుబడినవి కాగా ఎనిమిది కేసులు ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించినవి 18 కేసులు విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినవి, ఈ సందర్భంగా అక్ర మార్కుల నుంచి 33.12 లక్షల రూపాయల నగదుతో పాటు 44.30 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఎసిబి డిజి విజయ్ కుమార్ సోమ వారం మీడియాకు వెల్లడించారు. గత జనవరి నెల నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల రవాణా శాఖ చెకోపోస్టులు, సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. ఎనిమిది నెలల వ్యవధిలో 14 మంది అవుట్ సోర్సింగ్ (Outsourcing) ఉద్యోగులతో పాటు 167 మంది అధికారులు పట్టుబడగా వీరిని రిమాండుకు తరలించారు. వీరి వద్ద నుంచి 33.12 లక్షల రూపాయల లచం డబ్బులను జప్తు చేశారు. ఇదే సమయంలో ఆదాయానికి మించి తీసుకుంటూ దొరికిపోగా ఆదా ఆస్తులు కలిగిన కే సులో అరెస్టయిన వారి నుంచి రూ.44.30 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. కాగా గత ఆగస్టు నెలలో జరిగిన దాడుల్లో 31 కేసులు ఎసిబి నమోదు చేసింది. ఇందులో 15 ఘటనల్లో 18 మంది అధికారులతో పాటు నలుగురు అవుట్ సోర్సింగ్ సిబ్బంది లంచాలు యానికి మించి ఆస్తులు కలిగిన కేసులు రెండు, రవాణా శాఖ చెకోపోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నాలుగు చోట్ల తనిఖీలు జరిగాయి. మ రో ఏడు ఇతర కేసులు వున్నాయి. ఈ సందర్భంగా 2.82 లక్షల రూపాయల లంచం తాలూకు డబ్బులను జప్తు చేయగా అ క్రమార్కుల నుంచి 5.13 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు 177 కేసులకు సంబంధించి తుది నివేదికను సర్కారుకు ఎసిబి పంపింది. ఆగస్టు నెలకు సంబంధంచి 25 కేసుల తుది నివేదికను సర్కారుకు ఎసిబి పంపింది. కాగా సర్కారీ విభాగాల్లో అవినీతి, అక్రమార్కులపై ఎలాంటి సమాచారం వున్నా టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440446106కు ఫిర్యాదు చేయాలని ఎసిబి డిజి విజయ్ కుమార్ కోరారు.

Read hindi news hindi.vaartha.com

Read also

https://vaartha.com/telugu-news-bathukamma-government-decision-for-carnival-style-bathukamma-festival/telangana/540043/

ACB Arrests ACB Raids Telangana Breaking News Corrupt Officers ACB Action Illegal Assets Case latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.