Abdullapurmet Crime News: రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో మనుషులేనా అనేంత క్రూరమైన ఘటన ఒకటి బయటపడింది. వరసకు అక్క అయిన మహిళను ఆమె తమ్ముడే అత్యంత పాశవికంగా హత్య చేశాడు. కేవలం ఆమె ప్రవర్తన నచ్చలేదన్న నెపంతో ప్రాణం తీయడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పారవేసిన వైనం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
Read Also: Palnadu Love Failure Suicide: పల్నాడులో యువతి ఆత్మహత్య!
వరుసకు అక్క.. ఒంటరిగా నివాసం
పోలీసుల కథనం ప్రకారం.. బాటసింగారానికి చెందిన నీలా అనే మహిళ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుండి ఆమె ఒంటరిగా ఉంటోంది. అయితే, ఆమె ప్రవర్తన సరిగా లేదని, ‘చెడు తిరుగుళ్లు’ తిరుగుతోందని ఆమె తమ్ముడు పప్పు భావించాడు. ఈ విషయంలో వారి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అక్క ప్రవర్తన వల్ల తమ కుటుంబం పరువు పోతోందని కక్ష పెంచుకున్న పప్పు, ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
Abdullapurmet Crime News: కిరాతక హత్య.. మృతదేహం ముక్కలు
పథకం ప్రకారం నీలాను హత్య చేసిన పప్పు, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను సంచుల్లో నింపి, కొన్ని భాగాలను మజీద్‌పురా చెరువులో పడేశాడు. మిగిలిన భాగాలను సమీపంలోని చిట్టడవిలో పారవేసి ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు.

తనే ఫిర్యాదు చేసి.. పోలీసులకు దొరికిపోయి!
తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, తన అక్క కనిపించడం లేదంటూ పప్పు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, పప్పు మాటల్లో పొంతన లేకపోవడం, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తనే హత్య చేసినట్లు నిందితుడు పప్పు ఒప్పుకున్నాడు. నిందితుడు చూపిన గుర్తుల ఆధారంగా పోలీసులు చెరువులో, అడవిలో పడేసిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: