📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Principal: 81 మంది జెఎల్ లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్ విద్య కమిషనరేట్లో కౌన్సెలింగ్: ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణఆదిత్య

హైదరాబాద్,: రాష్ట్రం(Telangana)లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో(GovtJunior Collages) పనిచేస్తున్న సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్లకి ప్రిన్సిపాల్స్(Principal) గా పదోన్నతు(Promotions)లు పొందారు. 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్ పదోన్నతులు కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలిలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులు కృష్ణ ఆదిత్య 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్గా పదోన్నతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Principal: 81 మంది జెఎల్ లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి

సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు

కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, మెడ్చల్, రంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (డిఐఈవో) హాజరయ్యారు. పదోన్నతి పొందిన లెక్చరర్లను డైరెక్టర్ అభినందిస్తూ.. తమ కొత్త బాధ్యతలను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యారంగాన్ని మెరుగుపరిచే దిశగా నాయకత్వ భాధ్యతల్ని సమర్థంగా నెరవేర్చాలని ఆకాంక్షి ంచారు. పదోన్నతుల ప్రక్రియలో ప్రతిభకు, సేవలకు ప్రాధాన్యం ఇస్తూ, పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని డైరెక్టరేట్ మరోసారి హామీ ఇస్తుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకి ప్రిన్సిపాలుగా పదోన్నతి

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకి ప్రిన్సిపాలుగా పదోన్నతి ఇవ్వడం కోసం సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి ప్రిన్సిపాల్స్ పదోన్నతులు కల్పించారు. పదోన్నతుల అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ కొనసాగుతున్నట్టు అయింది. పదోన్నతులు పొందిన వారిలో తెలంగాణ ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(టిగ్లా) రాష్ట్ర అధ్యక్షులు ఎం జంగయ్య కూడా ఉన్నారు. పదోన్నతి పొందిన అనంతరం ఆయన మహబూబ్నగర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. జూనియర్ లెక్చరర్స్కి ప్రిన్సిపాల్స్ గా పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ విద్య డైరక్టర్ కృష్ణ ఆదిత్యకి టిగ్లా నేతలు మాచర్ల రామకృష్ణగౌడ్, నయీమ్ పాష, డాక్టర్ పరశురాములు, దుర్గాప్రసాద్, ముడి శేఖర్ దన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Congress Leader Murder: నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య

#telugu News academic administration education department government education policy JL promotions junior lecturers Latest News Breaking News principal appointments teacher promotions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.