📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Pashamylaram Reactor Blast : పాశమైలారం పేలుడులో 8 మంది మృతి – ఐజీ

Author Icon By Sudheer
Updated: June 30, 2025 • 8:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ కారిడార్‌(Pashamylaram Reactor Blast)లో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ జరగడంతో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఐజీ సత్యనారాయణ తెలిపారు. మొత్తం ప్రమాద సమయంలో సుమారు 90 మంది ఉద్యోగులు ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు సమాచారం.

అసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి

ఘటన తర్వాత తీవ్రంగా గాయపడిన 26 మందిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. అయితే, వారిలో రెండు మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వాస్తవిక పరిస్థితి పై పూర్తి నివేదిక వచ్చేంతవరకూ మరిన్ని మృతులు నమోదయ్యే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై విచారణ

ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు పాటించబడ్డాయా? లేక ఎలాంటి నిర్లక్ష్యం జరిగిందా అన్నదానిపై పోలీసులు మరియు ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం స్పందించి నివేదిక కోరినట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే కాకుండా, బాధ్యత వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : KTR Fire : రాహుల్ గాంధీ సిగ్గుపడండి – KTR

Pashamylaram Reactor Blast Pashamylaram Reactor Blast news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.