📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

MPTC: రాష్ట్రంలో 5,774 ఎంపిటిసి స్థానాలు: లెక్క తేల్చిన అధికారులు

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిటిసి(MPTC) స్థానాల లెక్క తేలింది. మొత్తంగా 5,774 స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్(Panchayat) శాఖ ఖరారు చేసింది. ఈనెల 12తో ఎంపిటిసి స్థానాల పునర్విభజన పూర్తయింది. దీంతో స్థానాలపై స్పష్టత వచ్చింది. గత మార్చిలో 5,817 ఎంపిటిసి స్థానాలు ఉండగా… ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. కొత్తగా ఏర్పాటైన మున్సి పాలిటీలు, కార్పొరేషన్ల(Corporation)లో పలు గ్రామాలు విలీనం కావడం, ఓఆర్ఆర్లోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం వేయడమే ఇందుకు కారణం కొన్ని మండలాల్లో జనాభా ప్రకారం రెండు, మూడు ఎంపిటిసి స్థానాలే ఉండటంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.

కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు

ఒక మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీల స్థానాలు ఉండే విధంగా మార్పులు వేసింది. వాస్తవానికి ఒక ఎంపిటిసి స్థానానికి 3,500 జనాభా ఉండాలి. ఎంపిపి వైస్ఎఎంపీపీలకు ఇద్దరు ఎంపిటిసి కావాలి. వారిని ఎన్నుకోవడానికి, వారు వేదిక మీద కూర్చుంటే సమావేశానికి హాజరుకావడానికి కనీసం మరో ఎంపిటిసి అయినా ఉండాలి. కానీ పలు గ్రామాల్లో ఆ పరిస్థితులు లేకపోవడంతో ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపిటిసిలు ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో అనేక మండలాల్లో ఐదు ఎంపిటిసిల స్థానాలు ఏర్పడ్డాయి, రాష్ట్రంలో గతమార్చి తర్వాత కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడటంతో సమీప గ్రామాలను అందులో కలిపారు.

MPTC: రాష్ట్రంలో 5,774 ఎంపిటిసి స్థానాలు

5,817 ఎంపీటీసీ స్థానాలు

ఓఆర్ ఆర్ లోపలి గ్రామాలను సైతం సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఎంపిటిసిల స్థానాలు సంఖ్య తగ్గింది. గత మార్చిలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. మేడ్చల్మల్కాజ్లిరి జిల్లాలో 19 ఎంపిటిని స్థానాలు ఉండగా ఆ జిల్లాను అర్బన్ జిల్లా మార్చారు. దీంతో 19 స్థానాలు కనుమ రుగైపో యాయి. ఖమ్మం, నారాయ ణపేట్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం జిల్లాల్లో నాలుగు చొప్పున, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలో ఒకటి చొప్పున ఎంపిటిసి స్థానాలు పట్టణ స్థానిక సంస్థల్లో వీలి నమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నెల్గొండ జిల్లాలో 352 ఎంపిటీసీ స్థానాలు ఉండగా.. అత్యల్పం గా ములుగు జిల్లాలో 84 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.

జిల్లాల వారీగా..
ఎంపిటిసిల స్థానాల వివరాలు మంచిర్యాలలో 166, ఆసిఫాబాద్లో 127, మంచిర్యాలలో 129, నిర్మల్ 157, కరీంనగర్లో 170. జగిత్యాలలో 216, సిరిసిల్లలో 123, పెద్దపల్లిలో 139, నిజామాబాద్లో 307, కామారెడ్డిలో 237, సిద్ధిపేటలో 230, సంగారెడ్డిలో 273, మెడక్లో 190. రంగారెడ్డిలో 231, వికారాబాద్లో 227, మహా బూట్నగర్లో 175, నారాయణపేటలో 132, నాగర్ కర్నూల్లో 210, గద్వాల్లో 142, వనపర్తిలో 133. సూర్యాపేటలో 235, నల్గొండలో 352, భువనగిరిలో 178, వరంగల్లో 130, హన్మకొండలో 129, ములు గులో 84, మహాబూబాద్లో 193, భూపాలపల్లి 109. జనగామలో 134, ఖమ్మంలో 288, కొత్తగూడెంలో 288లో ఉన్నాయి .

Read hindi news: hindi.vaartha.com

Read ALso : Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

#telugu News Andhra Pradesh politics Election Preparations Latest News Breaking News local body elections MPTC Elections MPTC Seats Panchayat Raj Village Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.