📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest News: TG: తెలంగాణ సచివాలయంలో 134 మంది ఏఎస్ఓల బదిలీ

Author Icon By Anusha
Updated: November 13, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) ప్రభుత్వం సచివాలయంలో భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. మొత్తం 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ASOs) ను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర కార్యాలయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఈ స్థాయి ఉద్యోగులను ఒకేసారి ఇంతమందిని బదిలీ చేయడం చాలా అరుదు. అందుకే ఈ చర్య వెనక ఉన్న కారణాలపై ఆసక్తి నెలకొంది.

Read Also: Uttam Kumar: రైతాంగానికి బాసటగా నిలుస్తాం ధాన్యం దిగుబడి కొనుగోళ్లలో రికార్డు

వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం (TG) ఒకేసారి వీరందరిని బదిలీ చేయడం వెనక బలమైన కారణమే ఉంది. వీరంతా నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే శాఖలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. దీనిపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. వీరిని బదిలీ చేయాలని కోరినా ప్రభుత్వం అప్పుడు స్పందించలేదు. కానీ తాజాగా ఒకేసారి 134 ఏఎస్ఒలను బదిలీ చేసింది.

వీరిలో కొందరు సుమారు 12 సంవత్సరాలుగా ఒకే శాఖలో కొనసాగుతున్నారు. అలాంటి వారందరిని ప్రస్తుతం ఇతర శాఖలకు బదిలీ చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.బదిలీకి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

TG

ఎక్కువ మంది సాధారణ పరిపాలన శాఖ

మొత్తం 134 మంది ఏఎస్ఓల (Assistant Section Officers) ను సచివాలయంలోని ఒక శాఖ నుంచి మరోక డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, వ్యవసాయం, పశు సంవర్థక, అడవులు, హోం, సాగునీటి పారుదల, పరిశ్రమలు, విద్యుత్తు, వైద్య ఆరోగ్యం, ఉన్నత విద్య, పురపాలక,

మైనారిటీల సంక్షేమం, రెవెన్యూ, ప్రణాళిక, పంచాయతీరాజ్‌, గిరిజన, ఎస్సీ అభివృద్ధి, రవాణా, యువజన సర్వీసుల శాఖ, మహిళా సంక్షేమం శాఖల నుంచి ఈ 134 మంది ఏఎస్ఓలను బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పరిపాలన శాఖ నుంచే ఉన్నారు. ఈ ఒక్క డిపార్ట్‌మెంట్ నుంచి ఏకంగా 28 మంది ఏఎస్ఓలను ప్రభుత్వం బదిలీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Administration ASO Transfers Government Transfers latest news Secretariat Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.