తెలంగాణలో 2045 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సు (Electric Buses) లు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు TGSRTC ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీ సందర్భంగా ఈ మేరకు వివరించింది. 2035 నాటికి 30% ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) నడుపుతామంది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు హైవేలపై ఉన్న డిపోలను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Rythu BimaApp:రైతు బీమాకు ప్రత్యేక యాప్
నగరాల్లో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు
ఇది రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఒక పెద్ద పర్యావరణ మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సుల పెరుగుదలతో నగరాల్లో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వాహనాల కారణంగా గాలి కాలుష్యం పెరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: