హైదరాబాద్ : తెలంగాణలో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్(2021), రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి(2021), ఆసిఫాబాద్ ఏఎస్పీగా చిత్తరంజన్(2022), కామారెడ్డి ఏఎస్పీగా బొక్కా చైతన్య(2022), జనగామ ఏఎస్పీగా పందిరే చైతన్య రెడ్డి(2022), భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా నగ్రాలే శుభం ప్రకాశ్(2022), నిర్మల్ ఏఎస్పీగా రాజేశ్ మీనా(2022), దేవరకొండ ఏఎస్పీగా పీ మౌనిక(2022) బదిలీ అయ్యారు.
తెలంగాణలో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
By
sumalatha chinthakayala
Updated: December 30, 2024 • 8:09 PM
. ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్.
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.