📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఊర‌ట‌

Author Icon By Vanipushpa
Updated: December 24, 2024 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగుబాటు విష‌యంలో బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊర‌ట‌ లభించింది. మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగుబాటు విష‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ మాజీ కేసీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుకు భూపాల‌ప‌ల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను హైకోర్టు స‌స్పెండ్ చేసింది. జిల్లా సెష‌న్స్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలు స‌రిగా లేవ‌ని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హ‌రీశ్‌రావు కార‌ణ‌మంటూ జిల్లా కోర్టులో పిటిష‌న్ వేసిన రాజ‌లింగ‌మూర్తికి న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది.
ఆదేశాలు సస్పెండ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగుబాటు విష‌యంలో గట్టిగా పోరాడుతున్నది. ఏవిధంగానైనా కేసీఆర్‌ను ఇబ్బందికి గురిచేయాలని కాంగ్రెస్ చూస్తుందని హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు.
ఈ అంశంలో జిల్లా కోర్టుకు విచార‌ణ ప‌రిధి లేద‌ని కేసీఆర్‌, హ‌రీశ్‌రావు త‌రఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇంత‌కుముందు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల‌ను న్యాయ‌వాది గుర్తు చేశారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు భూపాల‌ప‌ల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. తదుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 7వ తేదీకి వాయిదా వేసింది.

harishrao High court KCR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.