📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్

Author Icon By Vanipushpa
Updated: December 28, 2024 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఈరోజు అఫిడవిట్ సమర్పించారు. ఈ-కార్ రేసింగ్ కేసుపై ఏసీబీ విచారణ జరుపుతోంది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.

దీంతో కేటీఆర్ ఈరోజు రిప్లై ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఒప్పందం అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని తెలిపారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై పర్మిషన్‌కు సంబంధించి సంబంధిత బ్యాంకు చూసుకోవాలని అందులో పేర్కొన్నారు.
హెచ్ఎండీఏ సంస్థ పరిగణనలో ఉంటాయి
ఫార్ములా ఈ-కార్ రేస్‌ ను ప్రమోట్ చేసే ముందు చెల్లింపులకు సంబంధించి లీగల్ ఇష్యూస్ హెచ్ఎండీఏ సంస్థ పరిగణనలో ఉంటాయన్నారు. అలాగే రూ.10 కోట్లు దాటే చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదన్నారు. నగర, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ వ్యవహారాల్లో తనకు సంబంధం లేదన్నారు.

High court ktr Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.