సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

Read Time:  1 min
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయుల మృతి..!
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయుల మృతి..!
FONT SIZE
GET APP

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నిజాంపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని మరో లారీ వేగంగా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.