📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

లగచర్ల రైతులకు న్యాయం చేస్తాం: కేటీఆర్‌

Author Icon By Vanipushpa
Updated: December 16, 2024 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ అసెంబ్లీలో అరాచక, దుర్మార్గమైన ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. భూములు ఇవ్వని పాపానికి దళిత, బలహీనవర్గాల రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. భూములు ఇవ్వమన్న రైతులపై కేసులు పెట్టడమే కాకుండా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బేడీలతో ట్రీట్‌మెంట్‌పై మండిపాటు
లగచర్ల రైతులు ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఓ రైతుకు గుండెపోటు వస్తే బేడీలతో ట్రీట్‌మెంట్‌ చేయించారని పేర్కొన్నారు. కొడంగల్‌ నీ జాగీరా.. రైతుల భూములు గుంజుకుంటారా అని మండిపడ్డారు. ఎన్ని కుయుక్తులు చేసినా రైతుల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. ఆదానీతో రేవంత్‌ దోస్తీని నిలదీయాలని టీషర్టులతో వస్తే లోనికి వెళ్లనీయలేదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల అంశంపై చర్చించాలని పట్టుబట్టినా చర్చ పెట్టలేదని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు. న్యాయం జరిగేదాకా పోరాడుతామని.. లగచర్ల రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలను సేకరించి పెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వమే వద్దన్నదని తెలిపారు. రైతులకు రేవంత్‌ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అసెంబ్లీ రేపటికి వాయిదా
లగచర్ల రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శాసన సభలో చర్చించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. దీంతో శాసనసభ లోపలికి వెళ్లే దారిలో కూర్చుని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. గిరిజన రైతులకు సంకెళ్లా.. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల అంశంపై చర్చించరట కానీ.. పర్యాటకంపై చర్చిస్తామంటున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రూపాయి తెచ్చింది లేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రశ్నించినా, సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినా జైలుకు పంపిస్తామని రేవంత్‌ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది అరాచక ప్రభుత్వమా? ప్రజాస్వామ్య ప్రభుత్వమా అని కేటీఆర్‌ నిలదీశారు. రాజ్యాంగేతర శక్తిగా రేవంత్‌ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

assemble Farmers ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.