📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

రైతు భరోసాపై వేగంగా అడుగులు

Author Icon By Vanipushpa
Updated: January 2, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రైతులకు రైతు భరోసాపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం సచివాలయంలో సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ చర్చించనుంది. రైతు భరోసాపై నివేదికను తయారుచేసి ఈనెల 4న కేబినెట్ ముందు సబ్ కమిటీ ఉంచనుంది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసాపై వేగంగా అడుగులు తీసుకునే ఉద్యోగస్తులకు, ప్రజా ప్రతినిధులకు, ఐటీ పేయర్స్‌కు రైతు భరోసాపై సబ్ కమిటీ చర్చించనుంది.


సంక్రాంతి పండుగ నుంచి భరోసా
సంక్రాంతి పండుగ నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.7500ల చొప్పున రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైంది.
రైతు భరోసాకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి సారించిన సర్కార్.. కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సబ్ కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు , ఐటీ పేయర్స్ ఏలాంటి నిర్ణయం తీసుకోవాలి, రైతులకు ఎంత భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలా? లేదంటే ఇన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అంటూ కటాఫ్ పెట్టాలా అనే దానిపై సర్కార్ తర్జభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

4న తెలంగాణ కేబినెట్ సమావేశం

సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్ విషయంలో సబ్ కమిటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశం లోపు రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేసి అందజేస్తే.. సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే దానిపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతుల వేదికల ద్వారా సమావేశాలు పెట్టి గ్రామస్థాయి నుంచి రిపోర్టులను ప్రభుత్వానికి అందజేశారు అధికారులు. వాటి ఆధారంగా రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మొత్తానికి సంక్రాంతికి రైతుల ఖాతాలో ఎకరాకి రూ.7500 రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

rythu bharosa sub committee Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.