నర్సాపూర్ సమీపంలోని మేడాలమ్మ దేవాలయం సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఏడు మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారి నర్సాపూర్ ఆస్పత్రికి తరలింపు. ఘటన స్థలంలో హృదయ విదారక సన్నివేశం మృతుల బంధువుల రోధనలు చలింప చేశాయి.మెదక్ నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న రెండు ఆటో లను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ముందున్న ఆటోలోని ముగ్గురు ఘటన స్థలంలోనే మృతి. వెనక ఉన్న ఆటో ప్రయాణికులకు తీవ్ర గాయాలు.
మెదక్ రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
By
Vanipushpa
Updated: January 3, 2025 • 11:52 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.