📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

Author Icon By Sudheer
Updated: January 4, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో ఓ కీలక మార్పు జరగబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం తిరిగి బండి సంజయ్‌కి రాష్ట్రం లో బీజేపీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..? బండి సంజయ్ గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీకి మంచి జోష్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వంలో బీజేపీ గత ఎన్నికల్లో అనూహ్య విజయాలను సాధించింది. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటెల విజయం వెనుక బండి సంజయ్ కష్టం ఎంతో ఉంది.

ఇక, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాల కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎంపీలు అరవింద్, రఘునందన్రావు, డీకే అరుణ, మరియు ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే, బండి సంజయ్ పట్ల పార్టీ లో ఉన్న నమ్మకం, ఆయన ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకే మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

Also Read: రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?

ఇంకా, బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ ను కేంద్రమంత్రిగా నియమించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ తెలంగాణలో బీజేపీకి కీలకమైన నేతగా ఉన్నారు. అలాగే ఆయనపై గౌరవం కూడా ఎక్కువగా ఉంది. ఆయనకు కేంద్రంలో పదవిని ఇచ్చి తెలంగాణలో పార్టీని మరింత శక్తివంతం చేయాలని ఆ పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తెలంగాణలో బీజేపీ రాజకీయాలకు ఒక కీలక మలుపుగా మారిపోతుందనే సూచనలున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి, పోటీని మరింత ఉత్కంఠంగా మార్చేందుకు ఈ పరిణామాలు కీలకంగా మారవచ్చు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Bandi sanjay telangana bjp president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.