బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. బోంరాస్‌పేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లగచర్ల దాడి ఘటనలో అరెస్టయిన నరేందర్ రెడ్డి ఇప్పటికే బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే లగచర్ల దాడి ఘటన కంటే ముందే ఆయనపై బోంరాస్ పేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన నరేందర్ రెడ్డి
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు ముందస్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని, రూ.25 వేల సొంత పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది.
తనకు ముందస్తు బెయిల్ రావడంతో నరేందర్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేసారు. ప్రభుత్యం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు ఆయన అన్నారు.
పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
By
Vanipushpa
Updated: December 23, 2024 • 1:19 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.