📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

పట్నం క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

Author Icon By Sudheer
Updated: December 4, 2024 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసులో కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన ఇటీవలే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, 10 రోజుల క్రితమే పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం తాజాగా నరేందర్ రెడ్డి చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. కాగా గతంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విధానం పై హైకోర్టు తప్పు పట్టింది.

లగచర్ల భూసేకరణ కొరకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రధాన కుట్రదారుడని పోలీసులు, ప్రభుత్వం తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు కోర్టుకు తెలిపారు. ఏ2గా ఉన్న భోగమోని సురేష్ ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని వెల్లడించారు. సురేష్ తో దాదాపు 89 సార్లు నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారని ధర్మాసనానికి తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్ సహా ఇతర అధికారులను హత్య చేయాలనే కుట్రతో దాడి చేశారని కోర్టుకు విన్నవించారు. దాడికి కుట్రలో ఉందని.. అవన్ని దర్యాప్తులో బయడపడతాయని, అప్పటి వరకు కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. తాజాగా, ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నరేందర్ రెడ్డి దాఖలు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Patnam Narender Reddy Patnam Narender Reddy remand

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.