వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతులు, కూలిలకు ఆ వ్యవసాయ భూమిలో ఏదో అడవి జంతువు పాదముద్రలు కనిపించడం తో అందులో కొంత మంది రైతులు పెద్దపులి పాదముద్రలుగా గుర్తించి భయభ్రాంతులకు గురైన సంఘటన వరంగల్ జిల్లా నెల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామాల శివారులోని వ్యవసాయ భూముల్లో చోటుచేసుకుంది. రైతులు, కూలీల కథనం ప్రకారం రుద్రగూడెం గ్రామ శివారు లోకం హనుమంతు, మండ రాజిరెడ్డి, నూటెంకి మంకయ్య అనే రైతులతో పాటు మరికొంత మంది రైతులు మిర్చితో, ఇతర పంట నెల్లల్లో వ్యవసాయ పసుల కోసం వెళ్లిన రైతులకు, రైతు కూలీంకు వ్యవసాయ భూమిలో పులి కాలి మాదిరిగా పాదముద్రలు గమనించడంతో రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులు, భయభ్రాంతులకు గురయ్యారు. గురువారం రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో కుక్కలు పరుగెత్తుతూ సుమారు గుంట పాటు అరుస్తూ ఉండటం కొందరు గమనించారు. ఉదయం పులి అడుగులు కనిపించడంతో రాత్రి వేళ ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరించడాన్ని గమనించిన కుక్కలు అరుస్తూ వెంబడించనట్లు భావిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. సమీప కొండా పూర్ గ్రామ శివారులో నుంచి ఈ పెద్దపులి వచ్చి వ్యవసాయ భూముల నుండి రుద్రగూడెం మీదగా కొండాయిపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. అందించడంతో నర్సంపేట రేంజ్ లో పెద్దపులి సంచరించిన గుర్తులు కలిగిన వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు.
నల్లబెల్లి మండలంలో పెద్దపులి సంచారం
By
Digital
Updated: December 28, 2024 • 11:15 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.