తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు ప్రజా భవన్‌లో 2008 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చడం లేదంటూ డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన సందర్భంగా ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా ప్రజా భవన్‌లో 2008 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు.
ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదు
ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ.. 2008 డీఎస్సీ అభ్యర్థుల కోసం జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ చేసి కూడా సంవత్సరం గడిచింది.. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి కూడా 100 రోజులు కావొస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ తీసుకోని 4 నెలలు అవుతుంది.. ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని, ఇంట్లో వాళ్లపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: హైదరాబాద్‌లో వేయి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు