📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

గూగుల్ తో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం

Author Icon By Sudheer
Updated: December 4, 2024 • 9:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు అగ్ర సంస్థలు పరుగులుపెడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టగా..తాజాగా గూగుల్ ..తెలంగాణ సర్కార్ తో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో గూగుల్ తన మొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను స్థాపించనున్నట్లు (Google to set up its fifth Safety Engineering Centre) అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఐదవ సెంటర్‌గా నిలువడం విశేషం. ఈ కేంద్రం ఆధునిక సైబర్ భద్రతా పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడం వంటి కీలక రంగాల్లో పనిచేయనుంది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. గూగుల్‌తో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి గొప్ప గుర్తింపు లభించిందని తెలిపారు. హైదరాబాద్ లో ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, మెటా వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు GSEC తో తెలంగాణ ప్రపంచ సైబర్ భద్రతా రంగంలో ఒక ముఖ్యమైన హబ్‌గా ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గూగుల్ సీఐఓ రాయల్ హాన్‌సెన్ (Google headed by Royal Hansen), గ్లోబల్ గూగుల్ టెక్ వైస్ ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్, ఇతర గూగుల్ ప్రతినిధులు ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చారు. ఈ కేంద్రం సైబర్ భద్రత రంగంలో నిపుణులు, పరిశోధకుల కోసం ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. అంతేకాకుండా, ఇది ఆర్థిక ఉపాధి అవకాశాలను పెంచడం, రాష్ట్ర డిజిటల్ భద్రతా సామర్థ్యాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగనుంది.

ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యోల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గూగుల్‌ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించిన రేవంత్ సర్కార్ కు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

cm revanth Google to set up its fifth Safety Engineering Centre GSEC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.