📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

కేటీఆర్‌పై దిల్ రాజు విమర్శలు

Author Icon By Vanipushpa
Updated: January 2, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ పరిశ్రమను ముందు పెట్టుకుని తనను టార్గెట్ చేస్తున్న కేటీఆర్‌కు ఎందుకు కౌంటర్ ఇవ్వరని .. సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు చిత్ర పరిశ్రమ వద్ద సమాధానం లేకపోయింది. కేటీఆర్ పదే పదే పేరు మర్చిపోయాడని అరెస్టు చేశారని ప్రకటనలు చేస్తున్నారు. దీనిని సినీ పెద్దలు ఎందుకు ఖండించలేదని కమాండ్ కంట్రోల్ సెంటర్ భేటీ సందర్భంగా రేవంత్ వారిని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ దిల్ రాజు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దని దిల్ రాజు .. తన పదవి పేరుతో క్రియేట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కాస్త ఘాటుగానే కేటీఆర్‌కు సమాధానం ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎలాంటి దాపరికాల్లేకుండా జరిగిన ఈ సమావేశంలో పూర్తి స్నేహభావంతో జరిగిందనద్నారు. అనవసర వివాదాల్లోకి..రాజకీయాల్లోకి చిత్ర పరిశ్రమను లాగవద్దని ..రాజకీయ దాడి, ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని అందర్నీ కోరుతున్నామన్నారు. చిత్ర పరిశ్రమ భేటీపై కేటీఆర్ కాస్త వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. డైవర్ట్ చేసే క్రమంలో అల్లు అర్జున్‌ ను టార్గెట్ చేశారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి సినిమా వాళ్లపైన పడి అటెన్షన్-డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారని విమర్శించారు. సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్‌గా ఉన్నాడని అన్నారు.

కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పదవిని స్వీకరించిన దిల్ రాజు సైలెంట్ గా ఉండటం మంచిది కాదని చాలా వైపుల నుంచి సలహాలు రావడంతో ఆయన మధ్యే మార్గంగా సోషల్ మీడియాను ఎంచుకున్నారు.

Dil Raju ktr Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.