కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ శ్రేణులు షాక్ …

Read Time:  1 min
kamareddy congres
kamareddy congres
FONT SIZE
GET APP

తెలంగాణాలో అధికార పార్టీ కాంగ్రెస్ కు సొంత పార్టీ శ్రేణులే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండామోస్తు వచ్చిన తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికీ పదవులు ఇవ్వడం పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుక్కారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో సీనియర్‌ కార్యకర్తలు ఉన్నా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దుర్గం శ్యామలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ ఆవేద‌నను పార్టీ పెద్దలు గుర్తించకపోతే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను తొలగించి.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ప్రతిపాదించిన ఒరిజినల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.