📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

అల్లు అర్జున్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: December 26, 2024 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ పెద్దలతో సమావేశంలో రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేసారు. తమకు ఎవరిపైన కక్ష సాధింపులు లేవని అన్నారు. ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సహకారం కోరుకుంటుందో రేవంత్ వివరించారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని.. పూర్తి నివేదిక తో కలవాలని సూచించారు. ఇక, అల్లు అర్జున్ తో పాటుగా రామ్ చరణ్ తో తనకు ఉన్న సంబంధాల గురించి రేవంత్ ఆసక్తి కరంగా చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని రేవంత్ అన్నారు.
ఉద్దేశ పూర్వకంగా కేసులు పెట్టటం లేదు
రేవంత్ కీలక వ్యాఖ్యలు సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వం సినీ పెద్దల ముందు నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో సినీ రంగం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. డ్రగ్స్ పైన చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఎవరి పైనా కేసులు పెట్టటం లేదని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వానికి ఐటీ, ఫార్మాతో పాటుగా సినీ రంగం కూడా ప్రధానమైనదని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.

Allu Arjun Revanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.