📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అల్లు అర్జున్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు??

Author Icon By Sukanya
Updated: December 22, 2024 • 6:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట , అల్లు అర్జున్ అభిమాని రేవతి మృతి విషయంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నటుగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు . పుష్ప మూవీ బెనిఫిట్ షో లో జరిగిన తొక్కిసలాట గురించి తెలంగాణ అసెంబ్లీ లో MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ పై తీవ్ర ఆరోపణలు చేశారు . వీటికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగిన ఘటనను వివరిస్తూ అల్లు అర్జున్ కు సినిమా థియేటర్ కు రావడానికి ఎటువంటి పేమిషన్ లేదని , పోలీస్ వారు దానిని వివరిస్తూ సాధ్య థియేటర్ యాజమాన్యానికి లేఖ రాసారని తెలిపారు .

అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల ఐన తరువాత , సినీ రంగ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన ఘటనను ఉదాహరిస్తూ ” అల్లు అర్జున్ కు ఏమైనా కన్ను పోయిందా , కాలు పోయిందా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి .

అల్లు అర్జున్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు??

అసెంబ్లీ లో ప్రస్తావన , ఆరోపణల అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి , తనకు పర్మిషన్ ఇచ్చారని , తాను థియేటర్ లో ఉన్నపుడు బయట జరిగిన ఘటన తెలియదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు . తాను చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ” నా క్యారెక్టర్ పై న నిందలు వేస్తున్నారు అని ” చేసిన వ్యాఖ్యలు బారి దుమారాన్ని లేపాయి .

అసెంబ్లీ ప్రెస్ మీట్ అనంతరం జరుగుతున్న పరిణామాలు చాల వేగంగా కదులుతున్నాయి . ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నాయకులూ అల్లు అర్జున్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తుండగా , పోలీస్ వారు కూడా అల్లు అర్జున్ కు వ్యతిరేకం గా వ్యాఖ్యలు చేయడం , వీడియోలు రిలీజ్ చేయడం ఉత్కంఠను రేకెత్తిస్తుంది .
జరుగుతున్న పరిణామాలు , వాటి తీరును , వేగాన్ని బట్టి ఇవి అల్లు అర్జున్ ను మరింత చిక్కులులో పడేస్తాయని విశ్లేషకులు అంటున్నారు . అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ కాలం గడిచేకొద్దీ ఉత్కంఠత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయ్

Allu Arjun arrested Stampede

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.