📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అల్లుఅర్జున్ జైల్లో ఓ రాత్రి

Author Icon By Vanipushpa
Updated: December 14, 2024 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అల్లుఅర్జున్ జైల్లో రాత్రి భోజనం చేయకుండా నిద్రించినట్లు తెలిసింది. రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లుఅర్జున్ను ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్కు తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే రూ. 50 వేల పూచీకత్తుతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. దీంతో అల్లు కొద్దిసేపటి క్రితం విడుదల అయి ఇంటికి చేరుకున్నారు.

#Allu Arjun BAIL Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.