హైదరాబాద్: అనుమతి లేని లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఇటీవల కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల రెగ్యులరైజేషన్ను సోమవారం నుంచి మొదలుపెట్టింది. నిషేధిత జాబితాలో లేని, హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా లేని సర్వే నెంబర్లలోని ప్లాట్ లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ చేస్తున్నారు. ఎల్‌ఆర్ఎస్ (LRS) కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల 70 వేల ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయనున్నారు. దాంతో గత నాలుగేళ్ల నుంచి ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది.

మార్చి 31వ తేదీలోగా ఓపెన్ స్పేస్ చార్జీలు
అనధికారిక లేవట్లను క్రమబద్ధీకరణ చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ప్రభుత్వం వేగం పెంచుతుంది. 2020 ఆగస్టు 26 తేదీ నాటికి ఏదైనా లేఔట్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినట్లయితే, అలాంటి లేఅవుట్లలో మిగతా ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 31వ తేదీలోగా ఓపెన్ స్పేస్ చార్జీలు క్రమబద్ధీకరణ ఫీజు కల్పి చెల్లించే వారికి 25% రాయితీ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఒకవేళ ఎల్లారీస్ ఫీజు చెల్లించాక వారి అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే పది శాతం ప్రాసెసింగ్ చార్జీలు తీసుకొని మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారులకి వెనక్కి ఇవ్వనున్నారు.
ఫ్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ
పర్మిషన్ లేని లే ఔట్లలో ప్లాట్లు ఉన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఏ మేరకు సోమవారం నుంచి ఆ ఫ్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ మొదలైంది. గత నాలుగేళ్లుగా ప్లాట్లు రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాట కలిగించింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్లు నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకొని అక్రమ లేఔట్ లో జాబితా ఇలాంటి వివరాలను సాఫ్ట్వేర్ లో అనుసంధానం చేశారు.