Telangana government extends LRS subsidy period

LRS : ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు : తెలంగాణ ప్రభుత్వం

LRS : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. మొదట మార్చి 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం మేర రాయితీ ప్రకటించారు.

Advertisements
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు

ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు

అయితే ఈ గడువు ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఆశించినంత మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్న మేర స్పందన కూడా రాలేదు. దీనిలో భాగంగానే.. మరో సారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించింది.

4 లక్షల మంది దరఖాస్తుదారులు

ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. పథకం అమలు తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీనిని అధికారులు పరష్కరించేలోపే గడువు తేదీ సమీపించింది. దీంతో వరుసగా ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో చివరి రెండు రోజులు కార్యకలాపాలు సాగలేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తడంతో.. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించింది.

Related Posts
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్

జాన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సోమవారం మాట్లాడారు. తాను ఎటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనలేదని, అయితే బెయిల్ ఉత్తర్వులపై సంతకం చేయాలని వచ్చినప్పుడు నిరాకరించానని Read more

Swiggy: స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసులు
Swiggy gets Rs. 158 crore GST notices

Swiggy: ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీకి నోటీసులు అందాయి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుకు సంబంధించిన బకాయిలు Read more

పోసానికి 14 రోజుల రిమాండ్
మెడికల్ టెస్టుల్లో పోసానికి గుండె సమస్యలు

తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్ విధించింది. కేసు విచారణలో భాగంగా నిన్న 9 గంటలపాటు Read more

పొంగులేటి బాంబులన్నీ తుస్సు..తుస్సు..?
runamafi ponguleti

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సియోల్ పర్యటన అనంతరం రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు జరగబోతాయని, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×