Telangana budget is an ideal for the country.. MLC Jeevan Reddy

Jeevan Reddy : తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ..నలభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానని అన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి బడ్జెట్ రూపొందించారని..ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని.. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యకరమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధులో అనర్హులకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చారని విమర్శించారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటకి లాగాలనే రుణమాఫీ చేశామన్నారు. కేసీఆర్ చేసింది వడ్డీ మాఫీ మాత్రమే అని.. రుణమాఫీ చేయలేక కేసీఆర్ చేతులు ఎత్తేశారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో రెండు మాత్రమే అమలు కాలేదని.. అవి కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisements
తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం

వర్గీకరణ చేసింది రాజకీయ ప్రయోజనం కోసం కాదు

కేసీఆర్ ఎప్పుడైనా వ్యవసాయ కూలీల గురించి ఆలోచించారా? ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉచిత విద్యుత్ వల్ల తెలంగాణలో దాదాపు ఎనభై శాతం మందికి ఉపయోగపడుతోంది. కేసీఆర్ హయాంలో ఉప ఎన్నికలు ఎక్కడొస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ పొందిన వాళ్ళకి కూడా కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఒక సంవత్సరంలో 90 శాతం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. దళితుల్లో ఇప్పటివరకు రిజర్వేషన్ పొందని వాళ్ళకి అవకాశం కల్పించేందుకు ఒక అడుగు వేశాం. వర్గీకరణ చేసింది రాజకీయ ప్రయోజనం కోసం కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related Posts
Man Cuts Wife Braid : బ్యూటీపార్లర్​కు వెళ్లిన భార్య జడను కట్ చేసిన భర్త
MAN CUTS WIFE BRAID

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త, చివరికి ఆమె జడను కత్తిరించే స్థాయికి చేరుకున్నాడు. పోలీసుల సమాచారం Read more

వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతి
Watchman Ranganna Dies

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వివేకా Read more

లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లగ్జరీ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. ఈ Read more

CM Revanth : తెలంగాణ సీఎం పై ఏపీ మంత్రి ఆగ్రహం
ఎంపిహెచ్ఎల తొలగింపుపై

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని గాడ్సేతో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలను Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×