📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

WhatsApp: సూపర్ ఫీచర్ లాంచ్ చేసిన వాట్సాప్ .. ప్రత్యేకతలు ఇవే

Author Icon By Anusha
Updated: August 2, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్. ఈ అప్లికేషన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగమైపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌లోనూ, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపుకోవడంలోనూ, వీడియో కాల్స్ చేసుకోవడంలోనూ వాట్సాప్‌కి ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు. చదువురాని వారు సైతం ఈ యాప్‌ను సులభంగా వాడుతున్నారు అంటే దాని యూజర్‌ఫ్రెండ్లీ డిజైన్ (User-friendly design) ఎంత సింపుల్‌గా ఉందో అర్థం అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ మరోసారి తన యూజర్ల కోసం ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

కాల్ రిమైండర్ ఫీచర్

కొన్ని సార్లు బిజీగా ఉండడం వల్ల వాట్సప్ కాల్స్‌కు ఆన్సర్ ఇవ్వలేకపోతాం. ఆ తర్వాత కాల్ బ్యాక్ చేయడం కూడా మర్చిపోతాం. ఇటువంటి సమస్యకు చెక్ పెడతూ వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.. వాట్సాప్ (WhatsApp) ఈ కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.22.5లో టెస్ట్ చేస్తోంది. దీంట్లో మీరు మిస్డ్ కాల్స్ కోసం రిమైండర్‌లను సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. 2 గంటలు, 8 గంటలు, 24 గంటల రిమైండర్ సెట్ చేసుకుని కాల్‌కు మర్చిపోకుండా ఆన్సర్ చేయొచ్చు.చాలాసార్లు మనం కాల్ మిస్ చేసి తర్వాత ఎవరికి తిరిగి కాల్ చేయాలో మర్చిపోతాము. కానీ ఇకపై అలా జరగదు. మీరు ఎవరికి తిరిగి కాల్ చేయాలో వాట్సాప్ స్వయంగా మీకు గుర్తు చేస్తుంది.

ప్రొఫైల్ అప్‌డేట్ ఫీచర్..

వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ నుండి నేరుగా ప్రొఫైల్ ఫోటోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ డీపీని వాట్సాప్‌లో ఉంచాలనుకుంటే, ఆ ఫోటోను గ్యాలరీలోకి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా ఫోటోను సెలక్ట్ చేసుకుంటే వాట్సాప్‌లో ప్రొఫైల్ అప్‌డేట్ అయిపోతుంది. ఇది సమయాన్ని ఆదా చేయడంతో పాటు ప్రక్రియను సులభతరం అవుతుంది. ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే యూజర్లకు ఇవి అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుతం WhatsApp CEO ఎవరు?

ప్రస్తుతం WhatsApp CEO (Head of WhatsApp) విల్ క్యాత్‌కార్ట్ (Will Cathcart).

విల్ క్యాత్‌కార్ట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు?

విల్ క్యాత్‌కార్ట్ మెటా (Meta) CEO మార్క్ జుకర్‌బర్గ్‌కి రిపోర్ట్ చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: 

https://vaartha.com/ai-real-time-in-farming-artificial-intelligence-for-farmers/tech/524849/

Breaking News latest news Telugu News WhatsApp competing with Telegram and Snapchat WhatsApp new features update WhatsApp testing latest chat tools WhatsApp upcoming super feature

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.