📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

WhatsApp: వాట్సాప్ హ్యాక్ అయినట్టు అనిపిస్తే? ఇలా చేయండి

Author Icon By Tejaswini Y
Updated: November 24, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

WhatsApp: సోషల్ మీడియాలో తిరుగుతున్న APK ఫైల్ లింకులు వినియోగదారులకు పెద్ద ముప్పుగా మారుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని APK ఫైల్‌లను క్లిక్ చేయడం ద్వారా మొబైల్(mobile) పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉన్నదని, ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లలోని సెన్సిటివ్ డేటా పూర్తిగా బహిర్గతం అవుతుందని తెలిపారు. ఇటీవల తెలంగాణలో ఈ రకం మొబైల్ హ్యాకింగ్ కేసులు గణనీయంగా పెరిగినట్టు సమాచారం.

Read Also: M Revanth Reddy: తెలంగాణలో డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యకు చెక్

What to do if you think WhatsApp has been hacked

మొబైల్ హ్యాకింగ్

హ్యాకర్లు వాట్సాప్(WhatsApp) ద్వారా APK రూపంలో మాల్వేర్(Malware) పంపించి, ఫోన్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ఫోన్ హ్యాక్ అయ్యాక, అందులోని వాట్సాప్ గ్రూపులను, కాంటాక్టులను టార్గెట్ చేసి మరింత మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఫోన్ అసాధారణంగా వేడెక్కడం, బ్యాటరీ వేగంగా ఖాళీ అవడం, ఫోన్ పనితీరు నెమ్మదించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ డివైస్ ప్రమాదంలో ఉందని భావించాలన్నారు.

మీ WhatsApp హ్యాక్ అయ్యిందనిపిస్తే చేయాల్సినవి

  1. వెంటనే WhatsApp యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.
  2. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అధికారిక WhatsApp‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేసుకుని, మీ మొబైల్ నంబర్‌తో రీ-వెరిఫై చేయాలి.
  3. Two-Step Verification ఎనేబుల్ చేసి అకౌంట్ భద్రతను పెంచాలి.
  4. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Call Forwarding ఆప్షన్‌ను ఆఫ్ చేయాలి.
  5. Install from Unknown Sources ఆప్షన్‌ను తప్పనిసరిగా డిసేబుల్ చేయాలి.
  6. ఎలాంటి యాప్ అయినా గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేయాలి.
  7. మీ ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యిందని అనుమానం ఉంటే, ఫోన్‌ను రీసెట్ చేయడం ఉత్తమం.
  8. బ్యాంక్ ఖాతాల పిన్‌లు, పాస్‌వర్డ్‌లు తక్షణమే మార్చాలి.
  9. ముఖ్యమైన యాప్‌లకు పాస్‌కోడ్‌లు, బయోమెట్రిక్ లాక్‌లు తప్పనిసరిగా ఉంచాలి.

ఇంటర్నెట్‌ ద్వారా వచ్చే తెలియని లింకులు, APK ఫైళ్లను ఎప్పుడూ ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడటం ద్వారా ఈ రకమైన మోసాల నుంచి రక్షించుకోవచ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

APK Malware cyber security mobile hacking Telangana Cyber Crime Two Step Verification WhatsApp hack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.