WhatsApp new Update:మెసేజ్ చదివిన 15 నిమిషాల్లోనే మాయం!

Read Time:  1 min
WhatsApp new Update
WhatsApp new Update
FONT SIZE
GET APP

WhatsApp new Update: వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో వినూత్నమైన ప్రైవసీ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్న ‘డిసప్పియరింగ్ మెసేజెస్’ (Disappearing Messages) ఫీచర్‌లో 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల కాలపరిమితి మాత్రమే ఉండేది. కానీ, కొత్తగా రాబోతున్న ఈ అప్‌డేట్‌తో మెసేజ్ చదివిన కొద్దిసేపటికే అది దానంతట అదే మాయమయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

Read Also:Whatsapp : వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్

WhatsApp new Update

WhatsApp new Update: వాట్సాప్ తెస్తున్న కొత్త సెల్ఫ్-డిస్ట్రక్టింగ్ మెసేజ్ ఫీచర్

ఈ కొత్త ఫీచర్ ప్రకారం, మీరు పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి ఓపెన్ చేయగానే 15 నిమిషాల కౌంట్‌డౌన్ మొదలవుతుంది. ఆ సమయం పూర్తికాగానే సెండర్ మరియు రిసీవర్ ఇద్దరి చాట్ బాక్సుల నుండి ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి ఆ మెసేజ్‌ను అస్సలు ఓపెన్ చేయకపోతే, అది గరిష్టంగా 24 గంటల వరకు చాట్‌లో ఉంటుంది, ఆ తర్వాత దానంతట అదే ఎక్స్‌పైర్ అవుతుంది.

ఓపెన్ చేయని మెసేజ్‌లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్

ముఖ్యంగా బ్యాంక్ ఓటీపీలు (OTP), పాస్‌వర్డ్స్, పిన్ నంబర్లు లేదా ఇతర వ్యక్తిగత వివరాలను ఇతరులకు షేర్ చేసే వారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. సాధారణంగా ఇలాంటి సున్నితమైన సమాచారం చాట్ హిస్టరీలో ఉండిపోవడం వల్ల భవిష్యత్తులో రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ, ఈ 15 నిమిషాల ఆటో-డిలీట్ ఆప్షన్ వల్ల సమాచారం సురక్షితంగా మాయమవుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ బీటా వెర్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఇప్పటికే ప్రవేశపెట్టిన ‘వ్యూ వన్స్’ (View Once) ఫొటోలు, వీడియోల తరహాలోనే ఈ టెక్స్ట్ మెసేజ్ ఫీచర్ కూడా వినియోగదారుల ప్రైవసీని మరింత పటిష్ఠం చేయనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.