📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

వాట్సాప్లో కొత్త ఫీచర్

Author Icon By Sudheer
Updated: December 19, 2024 • 10:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల్ని కలిగి ఉన్న వాట్సాప్ తన యాప్‌లో వినూత్న మార్పులు చేస్తూ, వినియోగదారులకు మెరుగైన అనుభవం అందజేస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. తాజాగా గ్రూప్ కాల్స్‌కు సంబంధించిన కొత్త ఫీచర్ను తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ కాలింగ్ మరింత సులభతరం కాబోతోందని కంపెనీ తెలిపింది.

ఇప్పటి వరకు గ్రూప్ కాల్ చేయాలంటే, ఆ గ్రూప్‌లోని సభ్యులకు ఒకేసారి కాల్ వెళ్తుంది. అయితే, కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్‌లోని సభ్యుల్లో ఎవరికి మాత్రమే కాల్ చేయాలనుకుంటున్నారో, వారి నంబర్లను మాత్రమే సెలక్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది కాల్ చేసే సభ్యుడికి అనవసరమైన ఇబ్బందులను తగ్గించడమే కాకుండా, మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తుంది. అలాగే వినియోగదారుల వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని, వాట్సాప్ “పప్పీ ఇయర్స్” వంటి ఫన్నీ ఎఫెక్ట్స్‌ను కూడా పరిచయం చేయబోతోంది. ఈ ఎఫెక్ట్స్ ద్వారా గ్రూప్ కాల్ సమయంలో వినియోగదారులు తమ ముఖానికి పాపులర్ ఫిల్టర్స్‌ను ఉపయోగించి సరదాగా మెలకువలు పంచుకోవచ్చు. ఇది ముఖ్యంగా యువతలో క్రేజ్‌ను పెంచే అవకాశముందని భావిస్తున్నారు.

ఈ కొత్త మార్పులు వాట్సాప్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్లను కొన్ని ప్రాంతాల్లో పరీక్షిస్తున్నట్లు సమాచారం. విజయవంతమైతే ఈ ఫీచర్లను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

whatsapp whatsapp new feature

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.