📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Vivo Y400 Pro: మార్కెట్లోకి వివో వై400 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

Author Icon By Sharanya
Updated: June 20, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా చర్యలు తీసుకుంటోంది. వై సిరీస్‌లో భాగంగా తాజాగా వివో వై400 ప్రో (Vivo Y400 Pro) పేరుతో సరికొత్త మిడ్‌ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. నేటి నుంచే ఈ ఫోన్ అధికారికంగా మార్కెట్లో లభ్యం కానుంది. ఇది గతేడాది విడుదలైన వైవో వై300 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా భావించవచ్చు.

ఆండ్రాయిడ్ 15,డ్యూయల్ రియర్ కెమెరాతో క్లారిటీ

ఈ ఫోన్ ప్రధానంగా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుండటం విశేషం. దీనిలో 6.77 అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అమర్చారు. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా, వేగవంతమైన 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

ధర,డిజైన్, కలర్ వేరియంట్లు

8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ సుమారు రూ.25,000లకు అందుబాటులోకి రావచ్చని అంచనా. ఈ ధరతో మార్కెట్లో ఇప్పటికే ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ4, నథింగ్ ఫోన్ 3, మోటరోలా ఎడ్జ్ 60 వంటి మోడళ్లకు వివో వై400 ప్రో గట్టి పోటీనిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇక‌, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫెస్టివల్ గోల్డ్, ఫ్రీ స్టైల్ వైట్, నెబులా పర్పుల్ కలర్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ ఈ ఫోన్ లభ్యం కానుంది.

వివో వై400 ప్రో పూర్తి వివరాలు

వివో వై400 ప్రో ఫోన్‌లో

డిస్‌ప్లే: 6.77 ఇంచ్‌ AMOLED, 120Hz రిఫ్రెష్ రేటు, 4500 nits పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300
ర్యామ్: 8GB వరకు
స్టోరేజీ: 256GB వరకు
కెమెరా: 50MP డ్యూయల్ రియర్ కెమెరా (Sony IMX882), 32MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 5500mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ 15
ఇతర ఫీచర్లు: 3D కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌, IP65 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌, యూఎస్బీ టైప్‌ సీ పోర్ట్

Read also: Droupadi Murmu: రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

#5GSmartphone #Android15 #TechLaunch #VivoY400Pro #VivoYSeries Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.